Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారు కోవిడ్ ఆస్పత్రులు పెంచాలి

తెలంగాణ సర్కారు కోవిడ్ ఆస్పత్రులు పెంచాలి
X

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ లోని కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను సందర్శించారు. తొలుత ఆయన టిమ్స్ లో సౌకర్యాలను పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి సౌకర్యాలను ఇంకా ఎంతో మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి పన్నెండు వందల వెంటిలేటర్లను రాష్ట్రానికి ఇఛ్చిందని తెలిపారు. టిమ్స్ లో పూర్తి స్థాయి సిబ్బందిని భర్తీ చేయాలన్నారు. త్వరలోనే ఈఎస్ఐ ఆస్పత్రిలో కూడా కరోనా బెడ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు.. ఆగస్టు నెల అంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీ మోడల్ ను ఫాలో కావాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టెస్ట్ ల సంఖ్య ఎంత పెంచితే అంత వేగంగా కరోనాని నియంత్రివచ్చని తెలిపారు. తర్వాత కిషన్ రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరోనా మరింత తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోందన్నారు.

ఢిల్లీ-ముంబయ్ లతో పోల్చితే తెలంగాణ లో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ‘పాజిటివ్ కేసుల పై ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. పాజిటివ్ వచ్చి- హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. లక్ష జనాభాలో 476 టెస్టింగ్ కెపాసిటీ మాత్రమే తెలంగాణలో ఉంది. కరోనా పాజిటివ్ వస్తే దాచుకోవాల్సిన అవసరం లేదు. కేసులు దాచిపెట్టి , మరణాల సంఖ్య తగ్గించి చూపిస్తే కరెక్ట్ కాదు. ఉన్న లోపాలను సరిద్దుకోవడానికి రాష్ట్రంతో కలిసి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తాం. ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉంటే కరోనా దరి చేరదు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it