Telugu Gateway
Andhra Pradesh

ఈ ఐదేళ్లలో సాక్షికి సర్కారు యాడ్స్ రూపంలోనే 250 కోట్లు!

ఈ ఐదేళ్లలో సాక్షికి సర్కారు యాడ్స్ రూపంలోనే 250 కోట్లు!
X

తొలి ఏడాదే 52 కోట్ల ప్రకటనలిచ్చిన జగన్ సర్కారు

నెంబర్ వన్ పేపర్ కంటే నెంబర్ టూ పేపర్ కే ఎక్కువ మొత్తం

ఈ లెక్కన జగన్ సర్కారు ఐదేళ్ల పాలన పూర్తయ్యేలోగా సాక్షికి సర్కారు ప్రకటనల రూపంలో దాదాపు 250 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. ఎందుకంటే తొలి ఏడాది సాక్షికి సర్కారు ఇచ్చిన ప్రకటనల విలువ చూస్తే ఈ లెక్కలు ఖాయం కావటం పక్కా అన్పిస్తోంది. ఏపీ సీఎంగా జగన్ 2019 మేలో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2020 మే వరకూ చూస్తే సాక్షి పత్రికకు సర్కారు ఏడాది కాలంలో 52 కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇఛ్చింది. ఏపీ సర్కారు ప్రకటనల వ్యయంలో ఇది 51.62 శాతంగా ఉంది. సాక్షి తర్వాత ఎక్కుడ యాడ్స్ దక్కించుకున్నది ఈనాడు పత్రిక. ఈ పత్రికకు 39.64 కోట్ల రూపాయల యాడ్స్ దక్కాయి. సాక్షి, ఈనాడు తర్వాత మూడవ ప్లేస్ లో ప్రజాశక్తి పత్రిక ఉంది. ఈ పత్రికకు ఏడాదిలో దక్కింది దాదాపు మూడు కోట్ల రూపాయలు మాత్రమే. ఇక్కడ మనం ఓ విషయం ప్రస్తావించుకోవాలి.

సహజంగా సర్కులేషన్ పరంగా చూస్తే ఈనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. సాక్షిది రెండవ స్థానం. అయితే సాక్షి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన పత్రిక కావటంతో నిబంధనలు పక్కన పెట్టి మరీ పనికానిచ్చేస్తున్నారు. ఇక మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి అయితే ఇంచుమించు జీరో యాడ్స్ అని చెప్పుకోవచ్చు. కారణం అందరికీ తెలిసిందే. యాడ్స్ రేట్ల విషయంలో కూడా చాలా తేడాలు చేస్తున్నారని ఐఅండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ పై చాలా విమర్శలు ఉన్నాయి. అయినా ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పినట్లు కాకుండా ఆ డిపార్ట్ మెంట్ సొంతంగా వ్యవహరించే సీన్ ఉండదు. చంద్రబాబు జమానాలో అయితే సాక్షికి ఎన్నికల ఏడాదిలో కాస్త ప్రభుత్వ యాడ్స్ జోరుగానే ఇచ్చారు కానీ..తొలి నాలుగేళ్లలో పెద్దగా యాడ్స్ ఇఛ్చింది లేదు. అప్పుడు అయినా..ఇప్పుడు అయినా ఈనాడుకు ఓ అడ్వాంటేజ్ ఉంది.

సర్కులేషన్ పరంగా నెంబర్ వన్ కావటంతో సమాచారం అయినా..ప్రకటనలో రూపంలో వివరాలు అయినా ప్రజలకు రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఈ పత్రికకు యాడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు జమానాలో అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు భారీగానే యాడ్స్ వచ్చేవి. కాకపోతే అప్పటికీ ఇప్పటికి తేడా ఒకటి ఉంది. చంద్రబాబు ఈ రెండు పత్రికలకు యాడ్స్ ఇవ్వటం అంటే ‘ఫేవర్ చేయటం’ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ జగన్ సర్కారు విషయానికి వస్తే ఇక్కడ సాక్షి సొంత పత్రికలాంటిది. అయినా సరే ఏ మాత్రం వెరవకుండా జగనన్న యాడ్స్ పేరుతో దుమ్మురేపి సాక్షికే సర్కారు ఖజనా నుంచి సింహభాగం వెళ్లేలా చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు. మరో మూడున్నరేళ్ళు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కాకపోతే ఇంకాస్త పెరగొచ్చు కూడా.

Next Story
Share it