Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం
X

కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి మాత్రమే పాస్ లు మంజూరు చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా స్పందనలో నమోదు చేసుకుంటే చాలు వెంటనే వెంటనే మొబైల్ కు ఈ పాస్ వచ్చేలా చేస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చే పౌరులకు సంబంధించిన ఆరోగ్య విషయాలను వైద్య శాఖ సిబ్బంది పర్యవేక్షించేందుకు వీలుగా ఈ వివరాలు తీసుకుంటున్నారు.

కొత్తగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారు ఎవరైనా వైరస్ బారినపడ్డారా? సురక్షితంగా ఉన్నారా అనే అంశాలను పరిశీలించటానికి ఈ వివరాల ద్వారా వెసులుబాటు లభించనుంది. స్పందనలో దరఖాస్తు చేసుకుని ఆ ఈ పాస్ లను చెక్ పోస్టు ల వద్ద గుర్తింపు పత్రం తో పాటు చూపితే రాష్ట్రంలో కి అనుమతి ఇస్తారు. ఆగస్టు 2 తేదీ నుంచి ఈ తరహా విధానం అమల్లోకి వస్తుందని ఏపీ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక అధికారి ఎం టీ కృష్ణబాబు తెలిపారు.

Next Story
Share it