ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు
BY Telugu Gateway16 Aug 2020 8:16 PM IST

X
Telugu Gateway16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ కేంద్ర భద్రత పొందిన నర్సాపురం ఎంపీ ఇప్పుడు మరోసారి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.. ఈ సారి ఫోన్ ట్యాపింగ్ గురించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. తాను వాడే రెండు నెంబర్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు.
గత కొన్ని నెలలుగా తానే వాడే ఫోన్లలో పలు అవాంతరాలతోపాటు రకరకాల శబ్దాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ నిఘా వర్గాలు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నాయని..ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19, 21ని ఉల్లంఘించటమే అన్నారు. దీంతోపాటు తనకు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.
Next Story