Telugu Gateway
Telangana

ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ కరోనా పేషంట్లకు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ కరోనా పేషంట్లకు
X

కీలక నిర్ణయం వెలువడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 50 శాతం బెడ్స్ ను కరోనా పేషంట్లకు కేటాయిచేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో గురువారం నాడు భేటీ అయిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు.. ప్రతి ఆస్పత్రిలో 50 శాతం బెడ్ ను ప్రభుత్వానికి అందించడానికి అంగీకరించారు. వీటిలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు. ఈ బెడ్స్ ను వైద్యఆరోగ్యశాఖ నింపుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషంట్ల ను వైద్య ఆరోగ్య శాఖ పంపించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంగీకరించాయి. 50 శాతం బెడ్స్ ప్రభుత్వం అందించడానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

విధివిధానాలు రూపొందించేందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తో శుక్రవారం నాడు భేటీ అవ్వాలని హాస్పిటల్ యాజమాన్యాలను కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోవలసిన చార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా చార్జీలు చేయడంతో పలు ఆసుపత్రుల మీద లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయి. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేయడం తో పాటు రెండు ఆసుపత్రుల చర్యలు తీసుకుంది. మిగిలిన వాటికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

Next Story
Share it