Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
X

ఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అంతే కాదు..హైకోర్టులో విచారణ సక్రమంగానే సాగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే అభిప్రాయపడ్డారు. కేసులను అక్కడే తేల్చుకోవాలన్నారు.

అదే సమయంలో హైకోర్టును త్వరితగతిన ఈ కేసుల విచారణ పూర్తి చేయాలని సూచించారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఉత్తర్వులను పక్కన పెట్టాలన్నారు. ఈ ఆదేశాలను తొలగించాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి ఊరట దక్కలేదు.

Next Story
Share it