Telugu Gateway
Telangana

మానవత్వం లేని పాలకుల వల్లే ఈ దుస్థితి

మానవత్వం లేని పాలకుల వల్లే ఈ దుస్థితి
X

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1.82 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణలో వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని ప్రశ్నించారు. వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్‌ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడంలేదని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటు హాస్పిటల్స్‌ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ టెస్ట్‌ కిట్స్‌ లేవని చెబుతున్నారని ఆరోపించారు.

మానవత్వం లేని పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కోరత కూడా తీవ్రంగా ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల రేట్లను ప్రభుత్వమే ఫిక్స్‌ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, 17 మంది అధికారులను.. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించాలని భట్టి కోరారు.

Next Story
Share it