Telugu Gateway
Telangana

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్
X

పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త కార్యక్రమం ప్రకటించింది. గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్కుల అభివృద్ధి, మెక్కల పెంపకంలో వినూత్న డిజైన్లు, రోడ్ సైడ్ గ్రీనరీ పెంపకం లేదా ఇంటి మొక్కల పంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత ఉన్న గ్రీన్ కవర్ ని మధించేందుకు జిఐఎస్ వినియోగం, ఉపగ్రహ చిత్రాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ వంటి పద్ధతుల ద్వారా రికార్డు చేయనున్నారు. మొత్తం సిటీ గ్రీన్ కవర్ కు 85 శాతం వెయిటేజీ, మరో ఐదు శాతం గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు, మరో పది శాతం వివిధ డిజైన్లతో ఆకట్టుకునే విధంగా చేపట్టే ప్లాంటేషన్ కు వెయిటేజి ఇవ్వనున్నారు.

స్థూలంగా పురపాలిక మెత్తానికి అవార్డుతోపాటు, అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్డు సైడ్ మొక్కల పెంపకం వంటి ఇతర కేటగిరీలలోనూ అవార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమం నాలుగేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. గ్రీన్ స్పెస్ ఇండెక్స్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ శాఖ పట్టణాల్లో గ్రీన్ కవర్, ఒపెన్ స్పెస్ ల పైన రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమం ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పెద్ద ఎత్తున గ్రీన్ కవర్ ను రాష్ట్రవ్యాప్తంగా పెంచే ఉద్దేశంతో కొనసాగిస్తూ వస్తుందని, పట్టణాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.

Next Story
Share it