అచ్చెన్నాయుడికి బెయిల్
BY Telugu Gateway28 Aug 2020 12:39 PM IST

X
Telugu Gateway28 Aug 2020 12:39 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు లేకుండా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపి సర్కారు ఖజానాకు నష్టం చేశారనే ఆరోపణలపై ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డెబ్బయి రోజులుగా అచ్చెన్నాయుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దనే షరతుతో బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్న సమయంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరోనా సోకింది.
Next Story