ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలి
BY Telugu Gateway25 Aug 2020 7:15 PM IST

X
Telugu Gateway25 Aug 2020 7:15 PM IST
ఏపీలోని ప్రభుత్వ సలహాదారులు అందరూ రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.. రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి తాను నియమించిన సలహాదారుల నుంచి ఒక్క సలహా స్వీకరించిన పాపాన పోలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నీ తానే అయినట్లు, అన్ని నిర్ణయాలు తనవే కావాలన్నట్లు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వ్యక్తిత్వం ఉన్న వారెవరూ జగన్ పాలనలో సలహాదారులుగా కొనసాగలేరని పేర్కొన్నారు. ప్రజాధనం వృధా చేయకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాల్సిందిగా కోరారు. సలహాదారు పదవికి రాజీనామా చేసిన రామచంద్రమూర్తికి అభినందనలు తెలిపారు.
Next Story