Telugu Gateway
Politics

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శనివారం శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ప్రమాదానికి గురై మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ఎంపీ మల్లు రవితో కలసి బయలుదేరారు. వీళ్ళను డిండి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి వారితో కొద్దిసేపు వాదనకు దిగారు. చనిపోయిన కుటుంబాల పట్ల తమకు సానుభూతి ఉందని...వారిని పరామర్శించటానికి వెళితే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు సరైన రీతిలో న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు

. సరైన కారణాలు లేకుండా తమను అపటం ఏ మాత్రం సరికాదని వాదించారు రేవంత్ రెడ్డి. కావాలంటే పోలీసు వెహికిల్ లోనే వస్తానని తెలిపారు. అక్కడ సీబీసీఐడీ ఉంది... సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఇబ్బంది అనుకుంటే, ఆ పరిధి వరకు తాడు కట్టుకోండి కానీ తమను అడ్డుకోవద్దన్నారు. కానీ పోలీసులు రేవంత్ రెడ్డితోపాటు మల్లు రవిని అరెస్ట్ చేసి..ఉప్పునూతల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.

Next Story
Share it