రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు
BY Telugu Gateway27 Aug 2020 11:22 AM IST

X
Telugu Gateway27 Aug 2020 11:22 AM IST
అమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు డబ్బు వేశామన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఆలశ్యం అయింది తప్ప మరొకటి కాదన్నారు. కొంత మంది రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతి కౌలు రైతులకు పెించన్ కూడా పెంచాలనుకున్నామని..కొంత మంది కోర్టుకు వెళ్ళటంతో ఇది సాధ్యం కాలేదన్నారు.
ఎప్పుడో ఏప్రిల్ లో చెల్లించాల్సిన కౌలు డబ్బులు ఇంత వరకూ ఇవ్వలేదంటూ బుధవారం నాడు ఆందోళనకు దిగటం..వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఆర్ డీఏ తో కుదిరిన ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు డిమాండ్ చేశారు.
Next Story