Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు మతి స్థిమితం లేదు

చంద్రబాబుకు మతి స్థిమితం లేదు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. 16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రజలు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇచ్చిన తీర్పు చంద్రబాబు ‘రాజధాని డిజైన్‌’కు చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు. చివరికి చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని కూడా తుక్కు తుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. అయినా ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరపాలని బాబు అంటున్నారు.. తనకు నమ్మకం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్‌ విసిరారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదు 48 గంటల్లోగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూస్తే.. ఆయనకు మతిస్థిమితం పూర్తిగా లేదని రూఢి అవుతోందని అన్నారు.

డీసెంట్రలైజేషన్‌ను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని విమర్శించారు. చంద్రబాబుకు విశాఖపట్నంలో అడుగు పెట్టే హక్కులేదన్నారు. సొంత ప్రాంతమైన రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తుంటే.. దాన్నికూడా వ్యతిరేకించి సొంత మామకే కాకుండా సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు ఆ మూడింటిలో అమరావతి కూడా ఉందన్న విషయం మరిచిపోయారని అన్నారు. ఇకపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో సాగనివ్వబోమని అన్నారు.

Next Story
Share it