వర్మ కొత్త టార్గెట్....‘అర్నాబ్’ పై సినిమా
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కొత్త టార్గెట్ ను ఎంచుకున్నారు. ఏకంగా పేరు పెట్టి మరీ అర్నాబ్ ను టార్గెట్ చేశారు. ఆయనపై కొత్త సినిమా తీస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన వర్మ బుధవారం నాడు కొత్తగా అర్నాబ్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో అవే కేకలు..అవే అరుపులు. అర్నాబ్ నిర్వహించే షోలో ఎలా కేకలు ఉంటాయో..అచ్చం అదే తరహా కేకలతో ఈ పోస్టర్ ను విడుదల చేశారు.
అంతే కాదు..అర్నాబ్ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా వార్తా వేశ్య (న్యూస్ ప్రాస్టిట్యూట్) అని పెట్టారు. ఇటీవలే ‘పవర్ స్టార్’ సినిమాతో పలు వివాదాలకు కారణమయ్యారు వర్మ. మరి ఇప్పుడు అర్నాబ్ ను టార్గెట్ చేయటం ఆసక్తికరంగా ఉంది. దీనిపై రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్న ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=1xAerI7fXio