Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ప్రధాని కావాలని..జగన్ దగ్గర చేరి..రాజీనామా

చంద్రబాబు ప్రధాని కావాలని..జగన్ దగ్గర చేరి..రాజీనామా
X

కె. రామచంద్రమూర్తి. ఉమ్మడి రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఒకప్పుడు చంద్రబాబు ప్రధాని కావాలనే తన అభిమతాన్ని బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత సాక్షిలో చేరారు. సాక్షిలో పదవి విరమణ చేసిన తర్వాత ఏపీలో జగన్ సర్కారు కొలువుదీరటంతో రామచంద్రమూర్తికి కూడా ఓ సలహాదారు కొలువు దొరికింది. అదేంటి అంటే పబ్లిక్ పాలసీ సలహాదారు పదవి. అయితే విచిత్రం ఏమిటంటే ఆయన పదవిలో చేరి ఏడాది కూడా నిండక ముందే సలహాదారు పోస్టుకు గుడ్ బై చెప్పేశారు. మంగళవారం నాడు ఆయన తన రాజీనామా పత్రాన్ని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఏపీలోని సలహాదారుల వ్యవస్థపై చాలా విమర్శలే వచ్చాయి. అయితే పబ్లిక్ పాలసీ సలహాదారుగా రామచంద్రమూర్తి ఎన్నో ప్రణాళికలకు రూపకల్పన చేద్దామని అనుకున్నారు.

కానీ ప్రభుత్వంలో ఆ వాతావరణం లేకపోవటం..పోస్టు అయితే వచ్చింది కానీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహకారం లభించకపోవటం వల్లే ఆయన తన పదవికి గుడ్ బై చెప్పారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ సర్కారు సలహాదారులను అయితే పెద్ద ఎత్తున నియమించుకుంది కానీ వాళ్లకు సరైన టాస్క్ లు ఇచ్చినట్లు ఎక్కడా కన్పించటం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది సలహాదారులతో జగన్ ఈ ఏడాదిన్నర కాలంలో పెద్దగా సమావేశం అయింది కూడా ఏమీలేదని అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it