Telugu Gateway
Andhra Pradesh

రాజధాని బిల్లులపై సెప్టెంబర్ 21 వరకూ స్టేటస్ కో

రాజధాని బిల్లులపై సెప్టెంబర్ 21 వరకూ స్టేటస్ కో
X

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారం మరింత జాప్యం జరగటం ఖాయంగా కన్పిస్తోంది. గురువారం నాడు ఈ అంశంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించిన అంశంపై స్టేటస్ కో సెప్టెంబర్ 21 వరకూ కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో సర్కారు ఈ అంశంపై ముందుకు వెళ్ళటానికి ఛాన్స్ లేకుండా పోయింది. అయితే సెప్టెంబర్ 21 నుంచి ఈ అంశంపై రోజు వారీగా వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే నేరుగా కోర్టులోనే విచారణ చేపడుతామని తెలిపింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఓ వైపు స్టేటస్ కో ఉన్నా ప్రభుత్వం భారీ గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేసిందని పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటీషన్ వేశారు. అయితే హైకోర్టు దీనిపై ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 10లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అమరావతి నుంచి రాజధాని తరలింపునకు సంబంధించి ఇఫ్పటికే హైకోర్టులో ఏకంగా 70 పిటీషన్లు దాఖలు అయ్యాయి.

Next Story
Share it