Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన ఏపీ

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన ఏపీ
X

ఏపీ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేయటానికి ఇష్టపడటం లేదు. మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించి అసెంబ్లీ బిల్లులు ఆమోదించి..గవర్నర్ తో రాజముద్ర వేయించుకున్నా..హైకోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆగస్టు 14 వరకూ స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్కారు వెంటనే ఈ స్టేటస్ కోను ఎత్తేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆగస్ట్ 4న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ స్టే వెకేషన్‌ పిటిషన్‌ ను దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు.

ఇది సోమవారం నాడు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై తమ వాదనలు వినాలని అమరావతి రైతులు, అమరావతి జె ఏసీ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మరి సుప్రీంకోర్టులో అయినా ఏపీ సర్కారుకు ఊరట లభిస్తుందో..ఈ వ్యవహారంలో అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుందో వేచిచూడాల్సిందే. కేంద్రం తాజాగా మూడు రాజధానుల విషయంలో తన వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it