Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి

ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి
X

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం అస్తవ్యస్థంగా తయారైంది. సాధారణ పరీక్షలతోపాటు ప్రవేశపరీక్షలు అన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కారు మరోసారి పలు సెట్లకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది. ఇక తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ ను బట్టి ఖరారు చేయనుంది.

Next Story
Share it