జగన్ కుమార్తెకు ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ సీటు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు సాధించారు. ఆమె గ్యాడ్యుయేషన్ కూడా ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో పూర్తి చేసుకున్న విషయం తెలసిందే. ప్రస్తుతం ఆమె ప్యారిస్ లోని ఇన్ సీడ్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చేయనున్నారు. చిన్నప్పటి నుంచి హర్షారెడ్డి అన్ని పరీక్షలను డిస్టింక్షన్ లో పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఓ వైపు తాత రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, మరో వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలు శిక్ష అనుభవించటం వంటి సంక్లిష్ట సమయాల్లో కూడా హర్షారెడ్డి తన చదువు ఏ మాత్రం దెబ్బతినకుండా అంకితభావంతో లక్ష్యంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత అమెరికాకు చెందిన ఓ ఎంఎన్ సీలో ప్లేస్ మెంట్ దక్కినా కూడా హర్షారెడ్డి ప్యారిస్ లోని ఇన్ సీడ్ మాస్టర్స్ చేసేందుకే మొగ్గుచూపారు. ఈ యూనివర్శిటీ ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి యూనివర్శిటీలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్యారిస్ వెళుతున్న కుమార్తెను పంపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిలు మంగళవారం నాడు బెంగుళూరు వెళ్లనున్నారు.