Telugu Gateway
Andhra Pradesh

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’
X

విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులు

ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కన్పించకపోయినా రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలన్న దృడ సంకల్పంతో ఉన్నాం. ఈ రోజు కాకపోతే భవిష్యత్ లో అయినా దేవుడి దీవెనలతో..పరిస్థితులు మారి..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు. జగన్ ప్రసంగాన్ని పరిశీలిస్తే కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాలు ఉన్నంత వరకూ ఏమీ చేయటం సాధ్యంకాదనే సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్ లో అటు బిజెపి అయినా...మరో పార్టీ అయినా అత్తెసరు మెజారిటీ వస్తే ..ఆ పార్టీలు ఏపీలోని వైసీపీ సభ్యుల బలంపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే తప్ప ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పట్లో రాదని తేల్చేశారు.

మూడు రాజధానుల అంశంపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్నా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమన్యాయం వర్ధిల్లాలన్నా వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి..మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లును చట్టబద్దంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం’ అని ప్రకటించారు. ఇదిలా ఉంటే జగన్ తన ప్రసంగంలో ఏపీలో గత పధ్నాలుగు నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.

Next Story
Share it