Telugu Gateway
Andhra Pradesh

జగనూ...ఏపీలో వాషింగ్టన్ డీసీని తీసుకొచ్చిపెడతానన్నారు

జగనూ...ఏపీలో వాషింగ్టన్ డీసీని తీసుకొచ్చిపెడతానన్నారు
X

ఏపీ ప్రజలకు ఆ రాష్ట్రంలోని కీలక నేతలు అందరూ సినిమాలు చూపించిన వారే. ఒక్క చంద్రబాబునాయుడే కాదు .. ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆ కోవలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబునాయుడు అమరావతిని సింగపూర్ తరహాతోపాటు ఎన్నో దేశాల పేర్లను చెప్పి ప్రజలను కలల లోకంలో విహరింపచేశారు. ఆ తర్వాత ఏమైందో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ కూడా ఇవే తరహా మాటలు చెప్పారు. ఏపీలో కొత్తగా రాజధానిని కడుతున్నందున ఏకంగా ఏ వాషింగ్టన్ డీసీనో..అలాంటి మహానగరాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో జగన్ కు ఓ వైపు దివంగత సోమయాజులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆ వీడియోలో జగన్ వ్యాఖ్యలు యతాతధంగా... ‘కొత్తగా కట్టబోయే సిటీలో గార్డెన్ సిటీ తీసుకొస్తాం. లంగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. ఆ క్యాపిటిల్ సిటీ పై ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాం.

ఇవాళ కడుతున్న రాష్ట్రం. మాకున్న అడ్వాంటేజ్ ఏమి అవుతుంది అంటే ఇవాళ క్యాపిటల్ సిటీ కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఓ వాషింగ్టన్ డీసీనో లేకపోతే..అటువంటి మహానగరాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఇన్ ఫ్రాస్ట్రక్చర్..రోడ్లు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక మోడ్రన్ సిటీగా మారుస్తాం. ఆ మోడ్రన్ సిటీకి ప్లాన్ చేస్తాం. అక్కడ యాంకర్ క్లయింట్స్ కింద దేశంలోనే టాప్ క్లాస్.దేశంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్శిటీలు..స్కూళ్లను, టాప్ క్లాస్ మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా అంటే చాలా పారదర్శకంగా..చాలా అంటే చాలా వేగంగా ఆ కొత్త సిటీని తీర్చిదిద్దుతాం. ఒక యూఫోరియా క్రియేట్ చేసి..ఆ యూఫోరియా నుంచి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తాం.

డిమాండ్ నుంచి డబ్బులు అక్కడ నుంచి తీసుకొస్తాం. ఎందుకు ఒక మహానగరం ఉండాలి ..సిటీ ఉండాలి అంటే దీనికి ఓ కారణం ఉంది. ఏ గొప్ప చదువులు వ్యక్తి అయినా హైదరాబాద్, బాంబే, బెంగుళూరులో ఉండటానికి ఇష్టపడతారు. కానీ తిరుపతిలో ఉండటానికి ఇష్టపడరు.’ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కంటే గొప్ప మహానగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆ అంశంపైనా..జిల్లాలో తలసరి ఆదాయం పెంచేలా, ప్రతి జిల్లాలోనూ చదువుకున్న పిల్లలకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేలి అనే అంశంపై యాక్సెంచర్ అనే ఓ బహుళ జాతి సంస్థను అపాయింట్ చేసుకున్నట్లు తెలిపారు అందులో.2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో గురించి వివరిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గంట నిడివి ఉన్న ఈ వీడియోలో సరిగ్గా 30 నిమిషాల తర్వాత జగన్ రాజధాని గురించి చెప్పిన అంశాలు ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=8eWKUfo0z4M

Next Story
Share it