Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి రాసిన లేఖపై ఆయన ధ్వజమెత్తారు. ‘ఎవరో దారినపోయే వాళ్లు అంటారు చంద్రబాబు పది మర్డర్లు చేశారు హైదరాబాద్ లో అని. అలాగే లోకేష్ బాబు పది రేప్ లు చేశారు అంటారు. ఆధారాలు లేకుండా వారిపై విచారణ జరపొచ్చనా? యూ షో...ఆధారాలు చూపించండి టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి. ఆధారాలు చూపించకుండా ఒక అద్భుతమైన నాటకం ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు. ట్యాపింగ్ కు ఆధారాలు ఎక్కడ?. ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఈ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని చేస్తున్నారు. ఇధి చాలా దురదృష్టకరం. పచ్చ మీడియాతో ఆడిస్తున్న నాటకం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు..రాదు అని చెబుతున్నాం. ఏదైనా ఉంటే చట్టబదద్ధంగా చేస్తాం. సంఘ విద్రోహ శక్తులు..నిషేధిత సంస్థలు ఉంటే ట్యాప్ చేస్తారు కానీ..దేశ క్షేమం కోసం చేస్తారు..చట్టవ్యతిరేకమైన ట్యాపింగ్ చేయాల్సిన ఈ పరిస్థితి లేదు. న్యాయవ్యవస్థపై నిఘా పెట్టాల్సిన అవసరం మాకు లేదు.

రోజురోజుకు పతనదిశకు వెళుతున్న రాజకీయ పక్షం మీది. 74వ స్వాతంత్ర దినోత్సవానికి పురస్కరించుకుని అందరూ ఆఫీసుల్లో జెండాలు ఎగరేస్తుంటే..మీరు ఇంట్లో జెండా ఎగరేశారు. ఎన్టీఆర్ భవన్ కు వెళ్ళి జెండా ఎగరేసే ధైర్యం లేదు. రోజురోజుకు కుచించుకుపోతున్న పార్టీ మీది. ఈ ప్రబుత్వంపై ప్రజాస్వామ్య పద్దతుల్లో గెలవలేమని కారణంగానే దుష్ప్రచారం చేస్తున్నారు. అందరిని దూరం చేయాలని దుర్భుద్దితో ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీ కు ఈ దుర్భుద్ది..ఎందుకు భయం?. రాజనేరానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చేసిన మనీలాండరింగ్...సింగపూర్..మలేషియాలో దాచుకున్న డబ్బు బయటకు వస్తుందనా.. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆధారాలుచూపించాలి. మీడియాతో రాష్ట్రాన్ని పరిపాలించాలనుకోవటం..మీడియాతో ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలనుకోవటం సాద్యం కాదు అని గుర్తుంచుకోవాలి. మీరు సంఘ విద్రోహశక్తులతో మమేకం అయ్యారా?. ఉగ్రవాద శక్తులతో మమేయం అయ్యారా?. ఎందుకు మీకు ఉలికిపాటు చెప్పండి అంటూ అంబటి ప్రశ్నలు కురిపించారు.

ఎన్నికలప్పుడు మోదీని ఆయన ఎలా విమర్శించారో అందరికీ తెలుసు. ఎన్నికలైన తర్వాత మోదీని అద్భుతమైన నాయకుడని అంటున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుది. సీబీఐ, ఈడీ ఏపీలోకి రావడానికి వీల్లేదని గతంలో బాబు అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి సీబీఐ విచారణ కావాలంటున్నారు. అధికారం పోయాక వ్యవస్థలపై నమ్మకం కలిగిందా?. రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే అక్కడ ప్రమాదం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ విషయంలో గగ్గోలు పెట్టిన టీడీపీ ఎందుకు రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో మౌనంగా ఉంది. తన వారు అయితే ఒక విధంగా వేరే వారు అయితే మరో విధంగా చంద్రబాబు వ్యవహరిస్తారు’’ అని అన్నారు.

Next Story
Share it