Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘పరిశ్రమలకూ గుర్తింపు సంఖ్య’

ఏపీలో ‘పరిశ్రమలకూ గుర్తింపు సంఖ్య’
X

మనుషులకు ‘ఆధార్ కార్డు’ ఎలాగో..ఏపీలో పరిశ్రమలకూ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. పరిశ్రమ ఆధార్ పేరుతో ప్రత్యేక సంఖ్య కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనున్నది. కాగా.. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలు సేకరించనుంది.

Next Story
Share it