Telugu Gateway
Andhra Pradesh

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కన్నా ఘాటైన వ్యాఖ్యలతో ఇటీవల సీఎం జగన కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా అన్నట్లు విజయసాయిరెడ్డి గురువారం నాడు పలు ట్వీట్లు చేశారు. ముఖ్యంగా అందులో కన్నా, టీడీపీలపై విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు..‘ ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?; అని ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట TDP(తెలుగు దొంగల పార్టీ)నేతలు.పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే.ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా.’ అని ప్రశ్నించారు. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది. అయిదేళ్ళుగా ఐదు లక్షల కోట్లు అయ్యతో కలిసి తిన్న గిత్త 5 నెలలుగా నోరు కట్టుకుని 5 కేజీలు తగ్గిందట... దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్..!’ అంటూ వరస ట్వీట్లు చేశారు.

Next Story
Share it