Telugu Gateway
Telangana

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక  బ్రేక్
X

కీలక పరిణామం. తెలంగాణ సర్కారు ఓ వైపు పాత సచివాలయం కూల్చివేత పనులను శరవేగంగా పూర్తి చేస్తున్న తరుణంలో దీనికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకూ కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎలాంటి శాఖల నుంచి అనుమతులు తీసుకోలేదని పిటీషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా కోవిడ్ నిబందనలు పట్టించుకోలేదని, ఎన్జీటీ ఆదేశాలు కూడా పట్టించుకోవటంలేదని పిటీషనర్లు కోర్టుకు నివేదించారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించామని..సగం వరకూ పూర్తయ్యాయని..ఈ దశలో ఆపటం సాధ్యం కాదని పేర్కొంది. అయితే కూల్చివేతల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పిటీషనర్లు వాదించారు. దీంతో సోమవారం వరకూ కూల్చివేత పనులు ఆపేయాలని పేర్కొన్నారు. కూల్చివేతకు తీసుకున్న అనుమతులు, ఎన్జీటీ ఆదేశాలతో అఫిడవిట్ సమర్పించాలని తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Next Story
Share it