Telugu Gateway
Andhra Pradesh

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అప్పుడు అమరావతి కావాలో.విశాఖపట్నం కావాలో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. అవంతి ఆదివారం నాడు విశాకపట్నంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంపీ గా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని.. ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని అన్నారు. 2022 లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర ఉందో సమాధానం చెప్పాలన్నారు. అమరావతిపై చంద్రబాబు ఎన్నో భ్రమలు కల్పించారని ఎద్దేవా చేశారు. ‘‘ ఏపీ లో ప్రజాస్వామ్యం లేదని చెప్పే బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఏం చేశారు. తమ సొంత పనులు మినహా ప్రజల కోసం ఏమి చేయలేదు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అంటే హత్య చేసిన వాళ్ళని.. మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.

Next Story
Share it