తెనాలి ఎమ్మెల్యేకి కరోనా
BY Telugu Gateway19 July 2020 8:28 PM IST

X
Telugu Gateway19 July 2020 8:28 PM IST
ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వీడియో ద్వారా నిర్దారించారు. తనకు కేవలం జలుబు మాత్రమే ఉందని..ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని..ప్రజలకు ఫోన్ లో అందుబాటులో ఉంటానని ప్రకటించారు. తన కుటుంబంలో ఇతరులు ఎవరికీ కరోనా ఉన్నట్లు తేలలేదని..తానొక్కడిని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నానని తెలిపారు.
Next Story