Telugu Gateway
Politics

కెసీఆర్ తక్షణమే ఉస్మానియాను సందర్శించాలి

కెసీఆర్ తక్షణమే ఉస్మానియాను సందర్శించాలి
X

కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాను సిబ్బంది లోపలికి అనుమతించలేదు. వర్షం నీళ్ళతో నిండిపోయిన ఆస్పత్రిలో రోగులు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశానికి సంబంధించిన కథనాలు మీడియాలో రావటంతో సంజయ్ గురువారం నాడు ఆస్పత్రిని సందర్శించారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదన్నారు. ఓ వైపు ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం కెసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం అయ్యారని విమర్శించారు. గతంలో సీఎం కెసీఆర్ ఉస్మానియాకు కొత్త ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారని..కానీ ఇప్పుడు ఆ ప్రస్తావనే తేవటంలేదన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రిల్లోని సౌకర్యాలపై కనీసం నోరుమెదపటం లేదన్నారు. సీఎంకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ద ఆస్పత్రులపై లేదని..దీనికి కారణం ఆస్పత్రులకు డీపీఆర్ ఉండవని ఎద్దేవా చేశారు.

Next Story
Share it