Telugu Gateway
Andhra Pradesh

కోర్టు మొట్టికాయలు తిన్నా వైసీపీ సర్కారుకు బుద్ధి రావటం లేదు

కోర్టు మొట్టికాయలు తిన్నా వైసీపీ సర్కారుకు బుద్ధి రావటం లేదు
X

ఏపీలో వైసీపీ సర్కారు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అనవసర అంశాలపై దృష్టి పెడుతోందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవన్నారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించటం సంతోషకరమన్నారు. ఆయన నాయకత్వంలో బిజెపి బలపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై గట్టిగా పోరాడారని అన్నారు. ఓ వైపు ప్రపంచం మొత్తం కోవిడ్ తో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రం హస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పై కక్ష్య సాదిస్తుందని, కోర్ట్ ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదన్నారు.

భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. తమ పాలన ఏవిధంగా ఉందో ఒక సారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మెత్తం ఇంగ్లీష్ మీడీయం అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం తో 5 తరగతి వరకు మాతృభాష తప్పనిసరి చేసింది..రాజ్యంగంలో రాష్ట్ర రాజధాని అంశం పై కేంద్ర ప్రభుత్వానికే ఫైనల్ నిర్ణయం ఉంటుంది. అమరావతి ని రాజధాని గా సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. 2017 కేంద్ర బడ్జెట్ లో అమరావతి రైతు ఫూలింగ్ లో రైతు లకు పన్ను మినహాయింపు చేశారు. కాబట్టి రాజధాని మార్పు అంశం కేంద్ర పరిదిలోనే ఉంటుంది. అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి.. సెలెక్ట్ కమిటీ ఆమోదించిందా లేదా అనేది తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో అవినీతి బాగా పెరిగిపోయింది..కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Next Story
Share it