Telugu Gateway
Andhra Pradesh

బిజెపి సకలజనుల పార్టీ..సోము వీర్రాజు

బిజెపి సకలజనుల పార్టీ..సోము వీర్రాజు
X

ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బిజెపి మాత్రం సకల జనుల పార్టీ అని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు ఆ పార్టీ నేతలు గురువారం నాడు ఢిల్లీలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ‘రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2024లో అధికారం సాధించే దిశగా బిజెపి చాలా సీరియస్ గా ముందుకెళ్తుంది. టిడిపి, వైఎస్సార్సీపీ లు బీజేపీ వారితోనే ఉంది అని చెప్పే తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఏపీలో బీజేపీ - జనసేన కలిస్తే 25శాతం ఓటు శాతం వుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న కుటుంబ పరిపాలన మార్చడం కోసం మేము గట్టి ప్రయత్నం చేస్తాం.

రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ ఏమాత్రం జోక్యం చేసుకోదు. అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారం లోనే బిజెపి జోక్యం చేసుకుంటుంది.ఇప్పటి ప్రభుత్వం పంపిణి పేరుతో భూములు కొంటున్నారు దాంట్లో కూడా కమిషన్ లాగేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఏపీలో బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతుంది.. ఏపీ రాజకీయాలు ఉత్తరప్రదేశ్ రాజకీయలగా రానున్న రోజుల్లో మారనున్నాయి. 40 సంవత్సరాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. ములాయం సింగ్ యాదవ్ లాగానే సైకిల్ గుర్తు కలిగిన చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ సంక్షోభంలో ఉన్నారన్నారు.

Next Story
Share it