Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారు దూకుడుకు కృష్ణా బోర్డు బ్రేక్ లు

ఏపీ సర్కారు దూకుడుకు కృష్ణా బోర్డు బ్రేక్ లు
X

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ కూడా ఈ టెండర్లకు ఆమోదం తెలిపింది. ఈ దశలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఎంటరై..ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలంగాణ సర్కారు ఇఫ్పటికే బోర్డుకు గతంలోనే ఓ సారి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కారు సన్నాహాల్లో ఉండగా మరోమారు ఫిర్యాదు చేసింది.

దీంతో గతంలో తాము ప్రాజెక్టు ను నిలిపివేయాలని చెప్పామని..డీపీఆర్ కు కూడా తమకు సమర్పించలేదని తాజాగా రాసిన లేఖలో బోర్డు పేర్కొంది. అయితే ఏపీ సర్కారు ఈ లేఖను పట్టించుకునే అవకాశం ఉంటుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి లేఖలే వచ్చినా సర్కారు మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది. తాజా లేఖ విషయంలో ఇదే వైఖరి అవలంభిస్తుందా? లేక మార్పులు ఏమైనా ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it