Telugu Gateway
Telangana

శిథిల సచివాలయ చిత్రాలివే

శిథిల సచివాలయ చిత్రాలివే
X

లుంబినీ పార్కు ఎదురుగా నుంచుని పాత సచివాలయం చూస్తే ఇప్పుడు అక్కడ ఏమీ కన్పించదు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కినా మట్టికుప్పలు..తప్ప ఏమీ ఉండవు. తెలంగాణ సచివాలయం కూల్చివేతలు తుది దశకు చేరుకున్నాయి. రెండు బ్లాక్ లు మినహా శనివారం రాత్రి కి మిగిలిన బ్లాక్ ల కూల్చివేతలు అన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా ఒక్రటెండు రోజుల్లోనే పూర్తి అయిపోనున్నాయి. అసాధారణ రీతిలో భద్రత కల్పించి మరీ తెలంగాణ సర్కారు ఈ కూల్చివేతల పనులుచేపట్టింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ తోపాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ అన్నీ మూసేశారు. అంతే కాదు.. మింట్ కాంపౌండ్ దగ్గర బారికేడ్లు పెడితే ఖైరతాబాద్ నుంచి వచ్చే వాహనాలు, మనుషులు అటువైపు వెళ్ళటానికి ఉండదు. కానీ చాలా ముందే అంటే ఖైరతాబాద్ లో పెద్ద వినాయకుడిని పెట్టే ప్రాంతం నుంచే బారికేడ్లు పెట్టి అటువైపు ఎవరినీ అనుమతించలేదు.

అంటే ఏకంగా కిలోమీటర్ పైగానే ఆంక్షలు పెట్టారు శనివారంవరకూ. కూల్చివేతలు మెజారిటీ పూర్తి కావటంతో ఆదివారం నుంచి మాత్రం మినహాయింపులు ఇచ్చారు. అత్యంత రహస్యంగా ఈ కూల్చివేత పనులు సాగాయి. హైకోర్టు మీడియాకు అనుమతిస్తే ఏమవుతుంది అని ప్రశ్నించినా సరే సర్కారు మాత్రం కుదరదు అని చెప్పింది. అయితే కొంత మంది ఫోటోగ్రాఫర్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారీ భవనాలు ఎక్కి ఈ చిత్రాలను క్లిక్ మన్పించారు. ఇదే స్థలంలో తెలంగాణ సర్కారు అత్యాధునిక వసతులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రతిపాదించింది. అది కూడా ఏడాదిలో పూర్తి చేస్తామంటోంది.

Next Story
Share it