‘పవర్ స్టార్’ పోస్టర్ విడుదల చేసిన వర్మ
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ ‘పవర్ స్టార్’ పోస్టర్ ను విడుదల చేశారు. పవర్ కు..స్టార్ కు మధ్య ఓ గ్లాస్ ను కూడా పెట్టారు. ఇది జనసేన గుర్తు అన్న సంగతి తెలిసిందే. అంతే కాదు..ఎన్నికల పలితాల తర్వాత కథ అంటూ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేసి..దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా వర్మ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ కింద విడుదల చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఇటీవలే వర్మ ప్రకటించిన ‘మర్డర్’ సినిమా కూడా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి వర్మపై కేసు కూడా నమోదు అయింది. అయితే వర్మ విడుదల చేసిన పవర్ స్టార్ పోస్టర్ పై నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ఆరేళ్ల క్రితం విడుదల చేసిన ‘రెడ్డిగారు పోయారు’ సినిమా సంగతి ఏంటో తేల్చండి ముందు అంటూ ట్వీట్ చేశారు. మరి వర్మ దీనిపై స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.