Telugu Gateway
Politics

ప్రజాస్వామ్యం కోసం గళమెత్తండి

ప్రజాస్వామ్యం కోసం గళమెత్తండి
X

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఉద్యమానికి రెడీ అవుతోంది. తమ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలపై ఈ పోరు తలపెట్టింది. ముఖ్యంగా రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభానికి బిజెపినే కారణం అని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ అంశంపై ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నివాసం ముందు ధర్నా చేయటానికి కూడా సిద్ధం అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాందీ ఆదివారం నాడు ఈ అంశంపై ఓ వీడియో ద్వారా స్పందించారు. ‘స్పీక్ అప్ ఫర్ డెమాక్రసీ‘ పేరుతో హ్యాష్ ట్యాగ్ ఏర్పాటు చేసి ఈ పోరులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఓ వైపు కరోనాతో పోరాడుతుంటే బిజెపి మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రభుత్వాలను అస్ధిరపర్చే పనిలో ఉందని విమర్శించారు.

మధ్యప్రదేశ్ లో చేసినట్లుగానే ఇప్పుడు రాజస్థాన్ లో చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ న్యాయమైన డిమాండ్ ను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా పట్టించుకోకపోవటంపై పార్టీ మండిపడుతోంది. విశ్వాసపరీక్షకు నో చెప్పటంతో..సీఎం గెహ్లాట్ ఆదివారం నాడు కొత్త ప్రతిపాదన గవర్నర్ ముందు ఉంచారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తీర్పులతో సచిన్ పైలట్ తో సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం కష్టంగా మారింది.

Next Story
Share it