Telugu Gateway
Andhra Pradesh

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మారి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించాలని కోరారు. కోర్టు తీర్పు ప్రకారం రమేష్ కుమార్ ను నియమిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదన్నారు. ఆయన శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని ప్రజలు గమనించారన్నారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం..రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి అని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారు. నా మీద ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా? అని ప్రశ్నించారు. ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్య దేశం ..కోర్టులను గౌరవిద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కనున్న వారి మాటలు విని సీఎం జగన్ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.

Next Story
Share it