Telugu Gateway
Cinema

నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమను

నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమను
X

రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి శుక్రవారం నాడు మూడు స్వల్ప నిడివి వీడియోలను విడుదల చేశారు. వాటికి క్యాప్షన్స్‌ కూడా ఇచ్చారు. ఎవరు మాట్లాడుతున్నారో గెస్‌ చేయండి?, వాళ్లు బ్రదర్సేనా?, చెక్‌ దిస్‌ క్యారెక్టర్‌.. అంటూ పోస్ట్‌ లు పెట్టారు. సినిమా శనివారం ఉదయం విడుదల కానుండగా..వర్మ ముందే వీటిని విడుదల చేయటం ప్రేక్షకులను ఆకట్టకోవటానికే అన్న విషయం తెలిసిందే. ఓ వీడియోలో సంభాషణలు మరింత డ్యామేజింగ్ గా ఉన్నాయనే చెప్పొచ్చు. ‘నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమను. మీ అన్న సీట్లు అమ్ముకున్నాడు. పార్టీని విలీనం చేశాడు.

అది చేశాడు..ఇది చేశాడు అని ప్రతి ఒక్కరూ నన్ను తిడతారు ఏంటిరా?.’ అంటూ సాగే వీడియోను ఓ బిట్ గా, మరో నిర్మాత చెప్పే డైలాగ్ లతో మరో వీడియోను విడుదల చేశారు. ‘ ఓ సారి నా పిల్లలు నా దగ్గరకు వచ్చి నిజాయతీ అంటే ఏంటి నాన్నా అన్నారు. నిజాయతీ అంటే ప్రవణ్ కళ్యాణే రా అని మీ ఫోటో చూపెట్టా. డెడికేషన్ అంటే ఏంటి నాన్నా అని అడిగారు. అప్పుడు కూడా డెడికేషన్ అంటే మీ ఫోటో చూపెట్టా. ’ అంటూ క్లోజ్ చేశారు. మరో దాంట్లో ‘జయాపజయాలకు ఎవరూ అతీతం కాదు. తమ్ముడూ మేం తప్పు చేశామనటం అసలు కరెక్ట్ కాదు. మీరు ఈ దొంగతనాలు మానితే మంచిది అంటే..ఏమి మాట్లాడుతున్నారు మీరు ’ అంటూ మూడవ వీడియోను క్లోజ్ చేశారు.

https://www.youtube.com/watch?v=dgU2fu5N4A8

Next Story
Share it