Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులపై అప్పుడు చెప్పలేదే?

మూడు రాజధానులపై అప్పుడు చెప్పలేదే?
X

టీడీపీ సింగపూర్ మోడల్..వైసీపీ మూడు రాజధానులతో మేలు జరగదు

దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులపై వరస దాడులా?

కరోనా టెస్ట్ లు ఓకే..మిగిలిన విషయాలపై ఫోకస్ పెట్టాలి

ఇళ్ళ పట్టాల్లో భారీ అవినీతి

ప్రతిపక్షంలో ఉండగా ఎన్నడూ మూడు రాజధానులపై మాట్లాడని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కొత్త పల్లవి ఎత్తుకోవటం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ సింగపూర్ మోడల్ వల్ల ఎంత ప్రయోజనం జరిగిందో..వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని అన్నారు. రాజధానికి అంత భారీ భూ సేకరణ సరికాదనేది మొదటి నుంచి తాను చెబుతూనే ఉన్నానని..ఇప్పుడు అంతిమంగా నష్టపోతున్నది రైతులే అన్నారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు. అయితే ఇది మేరకు సాధ్యం అవుతుందో తెలియదన్నారు. రైతులు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. కరోనా టెస్ట్ ల విషయంలో ఏపీ సర్కారు పనితీరు బాగున్నా..తర్వాత వైద్యం, ఇతర సేవల విషయంలో వెనకబడిందని అన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులే తేలిక చేసి మాట్లాడటం వల్ల చాలా సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. కరోనా అలా వచ్చి ఇలా పోతుందని చెప్పటం సరికాదన్నారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ళను లబ్దిదారులకు అందజేయకపోవటం సరికాదన్నారు. తాను కర్నూలు పర్యటనకు వెళ్లి చూసినప్పుడు ఇళ్లు కట్టేసి ఉన్నాయి. ఎప్పుడూ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. లబ్దిదారులకు ఎప్పటికీ ఇవ్వరు.

వీళ్లు మా పార్టీ వాళ్లు కాదు. వీళ్లు మాకు ఓట్లు వేయలేదు. లేదంటే అక్కడ భూములను స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించుకుందామన్న ఉద్దేశాలు ఉండడం లాంటి రకరకాల కారణాలతోటి ఎప్పుడూ ఇళ్లు కట్టి వదిలేయడం అనేది రివాజుగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 10 వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఇన్ని లక్షల ఇళ్లు నిర్మించారు. కర్నూలులో, మంగళగిరిలో ఆ ఇళ్లను చూశాను. ఏ పర్యటనకు వెళ్లినా ఎవరో ఒకరు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు- మేం సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి రూ.50 వేలు మొదటి విడత కట్టాం.. మాకు ఇళ్లు రాలేదు అని. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అడుగుతుంటే మీరు మా పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని కొంత మందిని, మాకు అనుకూలంగా ఉంటానంటే ఇస్తామని చెప్పి మొత్తానికి దీన్ని ఒక అస్తవ్యస్తంగా తయారు చేశారు. కొత్తగా ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అంశంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయి రిపోర్ట్స్ ఏంటంటే ఉదాహరణకి ఒక ప్రయివేటు లాండ్ కొనాలంటే రూ.7 లక్షలో, రూ.8 లక్షలో ఉంటే అయితే దానికి దాదాపు నాలుగింతల నుంచి ఏడింతల వరకు, మరి కొన్ని చోట్ల రూ55 లక్షలకుపైగా ప్రభుత్వం చేత విలువ కట్టించారు. అది రైతులకు పూర్తిగా చేరదు. మధ్యలో దళారీలు ఉంటారు. చాలా అవకతవకలు జరిగాయన్నది ప్రతి చోట నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.

కచ్చితంగా ఇళ్ళ పట్టాల వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయి. దీనిని సరి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎవరైతే నిజమైన లబ్దిదారులు ఉన్నారో వారికి పట్టాలు అందించాలి. ఇవ్వలేని పక్షంలో వారికి మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం... దానికి పరిహారం ఏంటి అనేది చేయాలి. ఈ అవకతవకల్ని మాత్రం కచ్చితంగా అరికట్టాలి. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోం మంత్రి దళిత వర్గానికి చెందిన వారు. ఆవిడ హోమ్ శాఖ మంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఎలా తీసుకోవాలి. ఒకటో రెండో జరిగితే యాక్సిడెంటల్ గా జరిగాయి అనుకోవచ్చు. వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆ వర్గం పట్ల వారికి కచ్చితంగా సానుకూల దృక్పథం లేదనుకోవాలి. ఆ వర్గాల నుంచి వచ్చిన హోం మంత్రి ఉండి వారిని రక్షించలేకపోవడం నిజంగా చాలా బాధాకరం. కొంత మంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Next Story
Share it