అర్ధరాత్రి తిరిగొచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్
BY Telugu Gateway31 July 2020 9:50 AM IST

X
Telugu Gateway31 July 2020 9:50 AM IST
ఏపీ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. చివరకు ఈ వ్యవహారం హైకోర్టు..సుప్రీంకోర్టుల వరకూ వెళ్లి వచ్చింది.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సీఎస్ కు లేఖ రాసిన సర్కారు మాత్రం చాలా తీరిగ్గా సుప్రీంకోర్టులో తేలాక చూద్దాంలే అన్నట్లు వ్యవహరించింది. సుప్రీంకోర్టులో కూడా స్టే లభించకపోవటంతో వెంటనే గవర్నర్ ఆదేశాలను కూడా అమలు చేయకుండా చాలా తాపీగా అంటే గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లు అయింది.
Next Story