Telugu Gateway
Telangana

కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు

కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు
X

హైదరాబాద్ లో కొత్తగా ఐదు ఐటి పార్కులు రాబోతున్నాయని..వీటి ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నాలుగు దిక్కులా అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా తమ శాఖకు ఇదే ఆదేశాలు జారీ చేశారన్నారు. తూర్పు హైదరాబాద్ లో వచ్చే ఈ ఐదు ఐటి పార్కులు 25 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ పార్కులకు సంబంధించిన లేఖలను అందజేసే కార్యక్రమంలో కెటీఆర్ పాల్గొన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఐటి రంగంలో మంచి పురోగతి సాధిస్తోందని తెలిపారు. జాతీయ సగటు కంటే రెట్టింపు వేగంతో ముందుకెళుతోందన్నారు. నగరం నాలుగువైపులా మనం కావాల్సినంత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలికసదుపాయలు అన్ని వైపులా రావాలి. ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి స్థిరపడే లక్షలాది మంది ప్రజలకు నివాస సముదాయాలు ఉంటాడాలన్నారు. ఎంఎంటీఎస్ ను రాయ‌గిరి వ‌ర‌కు పొడిగించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. రాచ‌కొండ‌కు కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటుకు సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ చొర‌వ చూపార‌ని వెల్ల‌డించారు.

Next Story
Share it