Telugu Gateway
Andhra Pradesh

తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా

తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా
X

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో కొంత మంది ఇష్టానుసారం తిడుతున్నారని..అందుకే ఈ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇలా మడుగులో ఉండి తిట్టించే వారే ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు.

ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా..? ఈ దాడికి కారణం అని ముద్రగడ ప్రశ్నించారు. నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబే ముఖ్య కారణం. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంతో నష్టపోయానో మీ అందరికీ తెలుసు. కానీ ఏ నష్టానికి నేనెప్పుడు చింతించలేదుఅని ప్రకటనలో ముద్రగడ తెలిపారు.

Next Story
Share it