Telugu Gateway
Andhra Pradesh

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం
X

ఏపీ మంత్రులుగా ఉండి రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరి రాజీనామాలను ఆమోదించిన వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరిద్దరూ త్వరలోనే మంత్రి పదవులు కూడా వదులకునే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it