Telugu Gateway
Politics

మాస్క్ లేకుండా పనిచేస్తామన్న సీఎం మాయం అయ్యారు

మాస్క్ లేకుండా పనిచేస్తామన్న సీఎం మాయం అయ్యారు
X

‘తెలంగాణకు కరోనా వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాస్క్ లు లేకుండా పనిచేస్తారని సీఎం కెసీఆర్ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే సీఎం కన్పించకుండా పోయారు’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అధికారులు-మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికి తెలవదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని..కరోనా వైరస్ సోనిక వారికి వైద్యం అందించే పరిస్థితులు లేవని ఆరోపించారు. కరోనా వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతున్నారన్నారు.

ధనవంతులు ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ పేదలు రొడ్డెక్కకపోతే పూట గడవడం లేదని తెలిపారు. ప్రజలంతా భయంతో బతుకు వెళ్ళదీస్తుంటే సీఎం కెసీఆర్ మాత్రం చేతులెత్తేసి ఫాంహౌస్ కు వెళ్లారని విమర్శించారు. అవసరం లేకపోయినా తెలంగాణలో ఒక్క రోజులో సమగ్ర సర్వే చేసిన సర్కారు ఇప్పుడు కరోనా టెస్ట్ లు చేయటానికి ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి 50 శాతం బెడ్స్ ప్రభుత్వం తీసుకొని చికిత్స అందించాలన్నారు. కరోనా విషయంలో అన్ని వర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it