Telugu Gateway
Andhra Pradesh

వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది

వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది
X

ఏపీకి చెందిన సీనియర్ ఐపీఏస్ అధికారి, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ వైఎస్సార్ లేకపోవటం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైంది. సీఎం కొడుకును పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్లే జైల్లో పెట్టారు. వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటు ఐటీ శాఖ కార్యదర్శి గా నేను పనిచేశాను. వైఎస్ సీఎం గా ఉన్నపుడు కొందరు అధికారులను, వారు మూవ్ చేసిన ఫైల్స్ పై విచారణ జరిపింది. ఇందులో నన్ను మాత్రం విచారించలేదు, అది నా ఇంటిగ్రీటీ. నా బదిలీ ప్రభుత్వ విజ్ఞత కే వదిలేస్తాను, అనేక కారణాలతో నా బదిలీ జరిగి ఉండొచ్చు.

నా బదిలీ నిర్ణయాన్ని స్వాగతిస్తా. సీఎం వైఎస్సార్ చనిపోయినపుడు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సుబ్రహ్మణ్యం బదులు రచ్చబండను నేను వెళ్ళాల్సి ఉంది. సుబ్రమణ్యం తొలుత నన్ను వెళ్ళమని అడిగితే సరే అన్నాను, మళ్లీ ఆయనే వద్దనటంతో నేను ఆగిపోయాను. నాకు ఇది పునర్జన్మ గా భావిస్తున్నాను.’ అని వ్యాఖ్యానించారు. ఎంతో నిజాయతీగా వ్యవహరించిన తనను ఓ చిన్న కారణంతో బదిలీ చేయటంతో మాదిరెడ్డి ప్రతాప్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కన్పిస్తోంది. ఇన్ని సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నా తనకు ఒక్క అపార్ట్ మెంట్ కూడా లేదన్నారు.

Next Story
Share it