Top
Telugu Gateway

హైదరాబాద్ ను గాలికొదిలేసిన కెసీఆర్ సర్కారు

హైదరాబాద్ ను గాలికొదిలేసిన కెసీఆర్ సర్కారు
X

హైదరాబాద్ నగరంలో కరోనా పరిస్థితిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ హైదరాబాద్ లో కరోనా పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు పేలుతుందో తెలియటం లేదు. ఢిల్లీ నుండి వచ్చిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

హైదరాబాద్ లో టెస్టులు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను గాలికి వదిలేసింది. హైదరాబాద్ వాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొండి. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రం మీద చేసిన ఆరోపణలల్లో వాస్తవం లేదు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it