గవర్నర్ ను కలవండి...నిమ్మగడ్డకు హైకోర్టు ఆదేశం

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ కు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రమేష్ కుమార్ ను ఏపీ గవర్నర్ ను కలవాల్సిందిగా ఆదేశించింది. గవర్నర్ కు వినతిపత్రం అందజేయాలని సూచించింది. ఎస్ఈసీని నియమించే అధికారం ఆయనకే ఉందని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వటానికి సుప్రీంకోర్టు పలు పర్యాయాలు నిరాకరించినా కూడా ఎందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయలని సర్కారుపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
సుప్రీం ఎలాంటి స్టే ఇవ్వనందున హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్టే అని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున వాదనలు విన్పించిన లాయర్ అశ్వనీ కుమార్ తాము ఇఫ్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు కోర్టుకు నివేదించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. తిరిగి ఈ కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.