Top
Telugu Gateway

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం
X

కరోనా వ్యవహారానికి గత సంబంధించి గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ తోపాటు ఇతర అధికారులు హైకోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎందుకు కరోనా టెస్ట్ ల సంఖ్య తక్కువగా ఉంది?. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారా?. ప్రైమరీ కాంటాక్టులకు చేసిన పరీక్షలు ఎన్ని?. ర్యాపిడ్ టెస్ట్ ల్లో ఖచ్చితత్వం ఎంత?. ప్రైవేట్ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు..తీసుకున్న చర్యలు వంటి అంశాలపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. రాష్ట్రంలో కరోనా టెస్ట్ లు తగినన్ని జరుగుతున్నాయని..ఈ సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని సీఎస్ కోర్టుకు తెలిపారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కోర్టు ఆదేశాలు అన్నింటిని అమలు చేయటానికి తమకు రెండు వారాల సమయం కావాలని సీఎస్ కోర్టును కోరారు. దీంతో పలు అంశాలపై దాఖలు అయిన పిటీషన్లపై విచారణను కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా సీఎస్ విచారణకు హాజరుకావాలని..అదే సమయంలో అమలుకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. కరోనా విషయంలో ఐసీఎంఆర్ తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ తప్పులు లేకుండా ఇవ్వాలి..కరోనా సమాచారాన్ని ప్రతి రోజూ మీడియా లో ప్రసారం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 857 హోటల్స్ గదుల్లో ఐసోలేషన్ సెంటర్ల ను ఏర్పాటు చేశామన్న సిఎస్..248 మంది కోవిడ్ బారిన పడిన వారు ప్రస్తుతం హోటల్ గదుల్లో ఉన్నారు...పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్ ,కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్ ను వాడుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

కోవిడ్ పేషంట్లను హాస్పిటల్ లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభ తరం చేస్తామని సీఎస్ తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ ల విషయంలో నిపుణులతో చర్చించి ముందుకెళ్ళాలని హైకోర్టు సూచించింది. రాజస్థాన్ లో ఇఫ్పటికే ర్యాపిడ్ టెస్ట్ లను నిలిపివేశారని..అందులో పలితాలు కేవలం నలభై శాతం మాత్రమే ఖచ్చితత్వంతో వస్తున్నాయని పేర్కొంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ల ధరల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించి ప్రభుత్వానికి 726 ఫిర్యాదులు వచ్చాయని సీఎస్ వెల్లడించారు. వారికి నోటీసులు ఇఛ్చి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ గా 21 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారని సీఎస్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

Next Story
Share it