ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి నోటిఫికేషన్
BY Telugu Gateway30 July 2020 2:22 PM IST

X
Telugu Gateway30 July 2020 2:22 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ సీటు భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఇటీవల వరకూ మంత్రులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజీనామా చేయటంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ సీటు కు కాలపరిమితి అతి తక్కువ మాత్రమే ఉండటంతో ఒక్క మోపిదేవి ఖాళీ చేసిన స్థానానికే ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ సీటు పదవీ కాలం 2023 మార్చి 29 వరకూ ఉంటుంది. ఈ సీటు ఎన్నికకు సంబంధించి ఆగస్టు 6న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13గా నిర్ణయించారు. ఆగస్టు 24న ఎన్నిక జరగనుంది. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. ఏకగ్రీవంతోనే ఈ ఎన్నిక పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
Next Story