Telugu Gateway
Politics

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి
X

శాసనసభ సాక్షిగా చారిత్రక భవనాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిందేమిటి. చేసింది ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం నాడు మరోసారి సచివాలయం అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘ సెక్రటేరియట్ పై ఎన్ఎండీసీ కేంద్ర సంస్థతో సర్వే జరిగింది. సెక్రటేరియట్ పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ ఆరోవ నిజాం కాలంలో నానాల ముద్రణ జరిగింది అని ప్రచారం. జీ-బ్లాక్ నుంచి ఐదవ నిజాం పరిపాలన చేశారు అని ఇంగ్లీషు పత్రికలు కథనాలు రాశాయి. జీ-బ్లాక్ నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయి అందుకే వాటి కింద గుప్త నిధుల ఉంటాయి అనే అనుమానాలు ఉన్నాయి. సెక్రటేరియట్ కింద చరిత్రాత్మక విషయాలు-ఆధారాలు ఉన్నాయని మర్రి చిన్నా రెడ్డి హయాంలోనే అప్పటి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పాత భవనాలు హెరిటేజ్ లో ఏది పెట్టాలి.

ఏది పెట్టవద్దు అనే విషయం పై ఆల్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ .హెరిటేజ్ కమిటీ వేస్తాం అని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ లో చెప్పారు. జీ-బ్లాక్ ను వెంటనే కూల్చాలని అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడారు. 2016 లో జీ-బ్లాక్ కూల్చాలని ప్రభుత్వం లేఖ రాసిన వెంటనే సీఎం కేసీఆర్ దాన్ని ద్వేషిస్తూ మాట్లాడారు. వేల కోట్ల రూపాయల అక్రమాలు జరగడానికి అవకాశం ఉన్న శాఖలకు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఉంచారు. ఇరిగేషన్ లో మురళీధర్ రావు ఎలా ఉన్నారో- ఆర్కియాలజీ శాఖలో రఘునందన్ రావు ఉండటం వల్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మూడేళ్ళ కింద అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ కమిటీ వేస్తా అన్న కేసీఆర్ మూడేళ్లు గడుస్తున్నా కమిటీ వెయ్యలేదు. బిఆర్కే భవన్ ఉద్యోగులకు సైతం సెలవులు ఇచ్చి-సెక్రటేరియట్ కూల్చాల్సిన అవసరం ఎమి ఉందో ప్రభుత్వం చెప్పాలి? సచివాలయం చుట్టూ మూడు కిలోమీటర్ల చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టి కూల్చాల్సిన అవసరం ఏముంది? కూల్చుతున్న భవనాల కింద గుప్త నిధుల ఏమిలేకపోతే ఇంత సీక్రెట్ గా కూల్చుతున్నారు.

సచివాలయం కూల్చివేత పనులు వీడియో రికార్డ్ చేయడం లేదు!. ఆర్కియాలజీ శాఖ-ఎన్ఎండీసీ శాఖల ఆధ్వర్యంలో కూల్చడం లేదు? వెంటనే రఘునందన్ రావు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తొలగించాలి. ప్రభుత్వం వెంటనే హెరిటేజ్ కమిటీ అన్ని పార్టీల ఆధ్వర్యంలో వెయ్యాలి. సచివాలయం కూల్చివేత ప్రక్రియను ప్రచారం చేసేందుకు మీడియాను అనుమతించాలి. రెండేళ్ల క్రితం సెక్రటేరియట్ నమూనా విడుదల లో నల్లపోచమ్మ-మసిద్ లేదు. నల్లపోచమ్మ దేవాలయం కూల్చిన శాపం కేసీఆర్ తగులుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్-బీజేపీ ని వేరుగా కాంగ్రెస్ చూడటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాలు రాజ్యాంగానికి ఉల్లంఘించే విదంగా ఉండకూడదు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే కోర్టులు ఒప్పుకోవు-గతంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాయిజ సెక్రటేరియట్ కూల్చివేత-నిర్మాణం పై కేంద్ర డిపార్ట్మెంట్ ను కలుస్తాంజ టీఆర్ఎస్ పార్టీలో చెంచాలు ఎక్కువ అయ్యారు. చెంచాలు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పం’ అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ అసెంబ్లీలో చెప్పిన హెరిటేజ్ కమిటీకి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

Next Story
Share it