Telugu Gateway
Telangana

ఈ ఏడాది సామూహిక వినాయక నిమజ్జనం లేదు

ఈ ఏడాది సామూహిక వినాయక నిమజ్జనం లేదు
X

హైదరాబాద్ లో అత్యంత అట్టహాసంగా సాగే వినాయక నిమజ్జనాలకు ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కరోనా దెబ్బ కారణంగా సామూహిక నిమజ్జనాలు సాధ్యంకాదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. భక్తులు ఎక్కడికి అక్కడే భౌతిక దూరం పాటిస్తూ నిమజ్జనం చేసుకోవాలని సూచించింది. వినాయక చవితి సమీపిస్తుండటంతో ఈ ఏడాది ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని..అయితే ఈ సారి విగ్రహాల ఎత్తు విషయంలో పోటీపడొద్దని అన్నారు. మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎక్కడ అయితే విగ్రహాలు పెడుతున్నారో ఆ సమాచారం మాత్రం పోలీసులకు అందిస్తే సరిపోతుందని ఉత్సవ సమితి ప్రదాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. ఎప్పటిలాగా సెప్టెంబర్ 1న సామూహిక నిమజ్జనం వీలుకాదన్నారు. మండపాల వద్ద కూడా ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉండలన్నారు. వాళ్లు కూడా విధిగా మాస్క్ లు ధరించి, శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహా తయారీదారులను, ఉత్సవాలపై ఆధారపడి జీవనం సాగించే వారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఆగస్టు 22 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Next Story
Share it