Telugu Gateway
Politics

భారతీయ రైల్వేలపై చైనా కంపెనీ కేసు

భారతీయ రైల్వేలపై చైనా కంపెనీ కేసు
X

భారత్-చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తరుణంలో అటు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు చైనా కంపెనీలపై కొరడా ఝుళిపించాయి. కేంద్రం అయితే అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ తో సహా 49 యాప్ లపై నిషేధం విధించి చైనా కంపెనీలకు షాకిచ్చింది. అదే క్రమంలో భారతీయ రైల్వే కూడా చైనా కంపెనీకి కేటాయించిన 471 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. ఒప్పందం ప్రకారం ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే కారణంతో ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. దీంతో సదరు చైనా కంపెనీ ఇఫ్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ సీసీఐఎల్) తమ బ్యాంకు గ్యారంటీని క్యాష్ చేసుకోకుండా ఆదేశించాలని ఆ చైనా కంపెనీ కోర్టును అభ్యర్ధించింది. అయితే ఈ కంపెనీ నాలుగేళ్లలో కేవలం 20 శాతం పనిని మాత్రమే పూర్తి చేసింది. ప్రస్తుతం భారత్ లో చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న విషయం తెలసిందే. సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. దీనికి బలమైన కారణమే ఉంది. గల్వాన్ సరిహద్దులో భారతీయ ఆర్మీకి చెందిన సిబ్బందిని చైనా అకారణంగా పొట్టనబెట్టుకోవటమే దీనికి కారణం.

Next Story
Share it